ఉలవల్లో ప్రొటీన్ పుష్కంలంగా ఉంటాయి.
తక్షణ శక్తినిచ్చే సుగుణాలూ ఎక్కువ.
పిల్లలూ, పెద్దలు, ముఖ్యంగా మహిళలు దీన్ని ఆహారంలో తప్పక భాగం చేసుకోవాలి.
పోషకాహార లోపంతో బాధపడే వారు ఉలవలు తప్పక తీసుకోవాలి.
ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు, కాల్షియం, ఐరన్, ఫాస్పరస్‌లతో పాటు బోలెడంత పీచూ లభిస్తుంది.
జీర్ణశక్తి మెరుగుదలకూ ఉపయోగపడతాయి.
రక్తహీనతతో బాధపడేవారూ, కీళ్ల నొప్పులు ఉన్నవారు రోజూ రెండు చెంచాలైనా తీసుకోవాలి.
రోజంతా ఉత్సాహంగా ఉంచుతుంది.
రుతుక్రమ సమస్యలతో ఇబ్బందిపడే అమ్మాయిలు వీటిని ఆహారంలో భాగం చేసుకోవాలి.
వీటిలో యాంటీ ఆక్సిడెంట్లూ, ఖనిజ లవణాలూ ఉంటాయి.
చర్మాన్ని, జుట్టుని ఆరోగ్యంగా ఉంచుతాయి.
బరువు అదుపులో ఉంటుంది.