ఈ ఏడాది ‘వసంత పంచమి’ ఏ రోజంటే!

హిందువులు అత్యంత పవిత్రంగా భావించే పర్వ దినాల్లో వసంత పంచమి ఒకటి

ఈ ఏడాది జనవరి 26, గురువారం వసంత పంచమి వస్తోంది

వసంత పంచమి తిథి జనవరి 25న మధ్యాహ్నం ప్రారంభమవుతుంది

26న ఉదయం 10.28 గంటలకు ముగుస్తుంది

ఉదయం తిథినే ప్రామాణికంగా తీసుకున్నందువల్ల 26నే వసంత పంచమి

ఈ రోజు సరస్వతి అమ్మవారిని దర్శించుకోవడం ఆనవాయితీ

సరస్వతీ దేవి పుణ్యక్షేత్రాల్లో ఈ రోజు పిల్లలకు అక్షరాభ్యాసం చేయిస్తారు

తెలంగాణలోని బాసర, వర్గల్ వంటి క్షేత్రాలకు భక్తులు పోటెత్తుతారు

ఈ 26న రిపబ్లిక్ డే తోపాటు, వసంత పంచమి కూడా రావడం మరో విశేషం