వెన్న తీయని పాలలో కొవ్వు ఎక్కువగా ఉంటుంది.
కనుక ఆ పాలను తాగితే బరువు పెరుగుతారు.
అదే వెన్న తీసిన పాలు అయితే వాటిలో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది కనుక బరువు తగ్గుతారు.
బరువు తగ్గాలనుకునే వారు వెన్న తీసిన పాలు తాగాలి.
గేదె పాల కంటే ఆవు పాలలో తక్కువ కొవ్వు ఉంటుంది.
ఆవు పాలు తేలికైన పాలు. సులభంగా జీర్ణమవుతాయి.
ఆవు పాలలో కొవ్వు 3-4 శాతం ఉండగా, గేదె పాలలో 7-8 శాతంతో అధికంగా కొవ్వు ఉంటుంది.
ఆవు పాలు కంటే గేదె పాలలో ప్రోటీన్లు 10-11 శాతం అధికంగా లభిస్తాయి.
పాలు జీర్ణం అయ్యే వారు వాటిని నిర్భయంగా తాగవచ్చు.
పాలు తాగడం వల్ల శరీర కండరాలకు చాలా విశ్రాంతి లభిస్తుంది.
రాత్రి పడుకునే ముందు పాలు తాగడం వల్ల మంచి నిద్ర వస్తుంది.