కళ్లజోడు ధరించే వారిలో చాలా మందిలో కంటి కింద నల్లటి వలయాలు ఏర్పడతాయి.

ఒత్తిడి, నిద్రలేమి, హార్మోన్ల మార్పులు, జీవన శైలిలో మార్పులు కారణంగా కూడా నల్లటి వలయాలు ఏర్పడతాయి.

వలయాలను తగ్గించడానికి సహజ మార్గాలు అనేకం అందుబాటులో ఉన్నాయి.

కీరదోసను గుజ్జుగా చేసి నల్లటి వలయాలు ఏర్పడిన చోట రాస్తే.. మంచి ఫలితం లభిస్తుంది.

నిమ్మరసంలో రెండు, మూడు చుక్కల కొబ్బరి నూనె వేసి ముక్కుకిరువైపులా రాయాలి. రెండు నిమిషాల పాటు మర్దన చేయాలి.

తేనెలో కొద్దిగా పాలు, ఓట్స్ వేసి మెత్తని పేస్ట్ లా చేసుకోవాలి. దీనిని మచ్చలు పడిన భాగంగా రాసుకోవాలి.

బంగాళదుంపలను జ్యూస్ లా చేసి..దూదితో ముంచి ఆ దూదిని కళ్ల మీద ఉంచుకోవాలి. ఇలా చేస్తే కంటి కింద నల్లటి వలయాలు తొలగిపోతాయి.

రాత్రిళ్లు బాదం నూనెను ముక్కుకిరువైపులా రాసి నెమ్మదిగా మర్ధన చేయాలి. ఉదయాన్నే నీటితో కడిగేసుకోవాలి.

ఇలా రోజూ చేయడం వల్ల కళ్లజోడు పెట్టుకున్న ప్రాంతంలో ఏర్పడిన మచ్చలు తగ్గుముఖం పడుతాయని  నిపుణులు చెబుతున్నారు..