ట్రంప్ ‘ట్రూత్ సోషల్’ యాప్.. ఆపిల్ స్టోర్‌లో లాంచ్..!

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ‘ట్రూత్​ సోషల్​’ యాప్ వస్తోంది. 

ఆపిల్ యాప్ స్టోర్‌లో Truth Social యాప్ ఫిబ్రవరి 21న అందుబాటులోకి రానుంది.

గతేడాది అక్టోబర్‌లోనే ట్రంప్ సొంత సోషల్ ప్లాట్ ఫాం లాంచ్ చేస్తానని ప్రకటించారు

‘ట్రూత్​ సోషల్​’ పేరుతో సోషల్ మీడియా యా‌ప్‌ తీసుకొస్తున్నట్టు వెల్లడించారు

TMTG గ్రూపు ఆధ్వర్యంలో ఈ ‘ట్రూత్‌ సోషల్‌ యాప్’ లాంచ్ కానుంది

ఈ ట్రంప్ యాప్ అచ్చం ట్విట్టర్ మాదిరిగానే ఉంటుంది.. ట్రూత్ అని పిలుస్తారు.

ఈ ట్రూత్ సోషల్ యాప్‌లోనూ ట్విట్టర్ లాగే ఒకరినొకరు ఫాలో చేసుకోవచ్చు. 

యూజర్లు చేసే ప్రతి పోస్టుకు Truth అనే పోస్టు బటన్ కనిపిస్తుంది. 

సోషల్ దిగ్గజాలైన ట్విటర్, ఫేస్‌బుక్‌‌కు గట్టి పోటీ ఇస్తుందని ట్రంప్ భావిస్తున్నారు.

యాప్ ద్వారా ప్రతిఒక్కరికి గొంతునివ్వడం కోసమేనని అంటున్నాడు డొనాల్డ్ ట్రంప్