గాడిద పాలు మానవ రొమ్ము పాలు, ఆవు పాలతో సమానమైన ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలను కలిగి ఉంటాయి.

శిశువులకు ఇవి పట్టించడం మంచిది. కొవ్వు తక్కువగా ఉండి శరీరానికి కేలరీలు, విటమిన్- డి ఎక్కువగా లాక్టోస్ రూపంలో అందుతాయి. 

ఆర్థరైటిస్, దగ్గు జలుబు లాంటి ఇన్ఫెక్షన్లను నయం చేయడంలోనూ, గాయాలకు చికిత్స చేసేందుకు కూడా గాడిద పాలు వాడతారు.

యాంటీ-మెక్రోబయాల్ లక్షణాలు కలిగి ఉండి అంటువ్యాధులు, బ్యాక్టీరియా, ఇతర వైరస్‌లు వ్యాపించకుండా చేస్తాయి. 

అలర్జీని దూరం చేసి, రోగనిరోధక శక్తిని పెంచుతుంది. 

గాడిద పాలలో లాక్టోస్.. కాల్షియం గ్రహించడానికి సహాయపడి, ఎముక‌ల‌ను బ‌లంగా మారుస్తుంది.

రక్త నాళాలను విడదీసి, నైట్రిక్ ఆక్సైడ్ మీ రక్త నాళాలకు అందించి రక్త ప్రవాహాన్ని మెరుగుపరచడంతో రక్తపోటు తగ్గుతుంది.

గాడిద పాలు ఆహార పదార్థంగా కంటే ఎక్కువ సౌందర్య సాధనంగా బాగా పనిచేస్తాయి. 

వీటిలోని ప్రొటీన్లు నీటిని ఆకర్షించి , పట్టు సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. శరీరానికి అద్భుతమైన మాయిశ్చరైజర్‌గా పనిచేస్తాయి.

గాడిద పాలతో స్నానం చేయడం వల్ల మెత్తని, మృదువైన చర్మం సొంతం చేసుకోవచ్చు.

గాడిద పాలు సౌందర్య ఉత్పత్తులైన స్కిన్ క్రీములు, ఫేస్ మాస్క్‌లు, సబ్బులు, షాంపూల తయారీలో వాడతారు.