అధిక బరువును తగ్గించుకోవటానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటాం..

రోజు తాగే నీటితోనే బరువును సులభంగా తగ్గించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

శరీరం నుండి వ్యర్ధాలను బయటకు పంపటంలో, కొవ్వుని కరిగించి శరీరాన్ని తేలికగా మార్చటంలో నీరు సహాయపడుతుంది.

ఉదయం నిద్రలేవగానే అరలీటరు నీరు తాగటం అలవాటుగా మార్చుకోండి. ఏదైనా తినాలని అనిపించిన సమయంలో ఎక్కువ మొత్తంలో నీరు తాగండి.

సమయానికి ఆహారం తీసుకుంటూనే మధ్యమధ్యలో ఆకలి అనిపిస్తుంటే మాత్రమే నీరు ఎక్కువ మొత్తంలో తీసుకోవాలి.

చల్లగా ఉండే కూల్ వాటర్ జోలికి మాత్రం వెళ్లకండి. గోరు వెచ్చని నీటిని తాగటం అలవాటుగా మార్చుకోండి.  కొవ్వును కరిగించటంలో గోరు వెచ్చని నీరు సహాయపడుతుంది.

భోజనం చేయకముందే నీరు తాగటం మంచిది. దీని వల్ల అతిగా తినకుండా చూసుకోవచ్చు.

నీటిలో అల్లం, తేనె, నిమ్మరసం, సబ్జా గింజలు, పండ్ల ముక్కలు వేసుకుని తాగటం వల్ల శరీరానికి మంచి పోషకాలు అందుతాయి.

రోజుకు పావు లీటరు నుంచి ముప్పావు లీటరు నీరు తాగినవారు 68-205 కేలరీలు తక్కువగా తీసుకుంటారని పరిశోధనలో తేలింది.

అతిగా నీరు తాగితే శరీరంలో సోడియం స్థాయిలు తగ్గుతాయి. శరీరంలో సోడియం తక్కువగా ఉండటం.. ప్రాణాంతకం కావచ్చు. దీనిని దృష్టిలో ఉంచుకుని మీ శరీరానికి సరిపడా నీళ్లు తాగడం మంచిది.