గుండెకు రక్తాన్ని సరఫరా చేసే ధమనులలో..

ఒకటి పూర్తిగా పూడుకుపోవడం వల్ల ఎదురయ్యే తీవ్రమైన పరిస్ధితిని గుండెపోటుగా చెప్పవచ్చు.

గుండె పోటు వచ్చే సమయంలో కొన్ని లక్షణాలు హెచ్చరికల రూపంలో ముందస్తుగానే కనిపిస్తాయి.

కారణం లేకుండా అకస్మాత్తుగా చెమటలు పట్టటం వంటి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం తగదు.

ముఖ్యంగా మహిళల్లో ఈ తరహా పరిస్ధితి కనిపిస్తుంది.

కాళ్లు, పాదాలతో పాటు చీలమండం ప్రాతం ఉబ్బినట్లు అనిపిస్తే..

గుండె రక్తాన్ని సక్రమంగా పంప్ చేయట్లేదని అర్థం.

ఇది గుండె వైఫల్యంతో పాటు హార్ట్ అటాక్‌కు కారణం కావచ్చు.

గుండె తగినంత వేగంగా రక్తాన్ని శరీర భాగాలకు పంప్ చేయలేనప్పుడు..

రక్తం సిరల్లోకి తిరిగి వచ్చి, అవి ఉబ్బుతాయి.