మీ పెంపుడు జంతువుల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
పెంపుడు జంతువులు శుభ్రంగా లేకుంటే అవి ఈగలను ఆకర్షిస్తాయి.
పెంపుడు జంతువులకు క్రమం తప్పకుండా స్నానం చేయించాలి.
మంచి క్రిమిసంహారక మందులతో మీ ఇంటిని శుభ్రపరచడం ద్వారా ఈగలను వదిలించుకోవచ్చు.
కిచెన్, డైనింగ్ టేబుల్, బాత్‌రూమ్‌పై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.
ఇందుకోసం అవసరమైతే ఈగలు పారద్రోలే స్ప్రేలు, ఫ్లై కిల్లర్ ఉపయోగించవచ్చు.
1 గ్లాసు నీటిలో 2 టీస్పూన్ల ఉప్పు వేసి ద్రావణాన్ని తయారు చేసుకుని స్ప్రే బాటిల్‌లో నింపి ఇంట్లో స్ప్రే చేయాలి.
ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో నుండి ఈగలు వెళ్ళిపోతాయి.
ఈగలను చంపేందుకు ప్రస్తుతం మార్కెట్లో కొన్ని విద్యుత్ పరికరాలు అందుబాటులోకి వచ్చాయి.