వేసవిలో సీజనల్‌ పండ్లు, కూరగాయలు ఎక్కువగా తినాలి..

ఇంట్లో వాతావరణం చల్లగా ఉండే విధంగా చూసుకోవాలి.

నీరు సమృద్ధిగా ఉండే పుచ్చకాయలు,  ఖర్బూజ, కొబ్బరి బొండాం అధికంగా  తీసుకోవాలి.

నీటిశాతం ఎక్కువగా ఉండే టమాట, దోస, బీర, సొరకాయ వంటి కూరగాయలు తినాలి.

డీ హైడ్రేషన్ రాకుండా రోజూ రెండు నుంచి మూడు లీటర్ల నీరు తప్పకుండా తాగాలి..

మసాలాల ఆహారం వల్ల ఎక్కువగా చెమటపడుతుంది. ఫలితంగా శరీరంలోని నీరు తగ్గిపోయి డీ హైడ్రేషన్ వస్తుంది. వీటికి దూరంగా ఉంటే మంచిది..

వడదెబ్బ తగిలినట్టు అనిపిస్తే…నిమ్మ రసంలో చిటికెడు ఉప్పు కలుపుకొని తాగండి. దీనివల్ల మనం కోల్పోయిన ఎలక్ట్రోలైట్స్‌ శరీరానికి అందుతాయి.

బయటికి వెళ్తున్నప్పుడు నీళ్లు, తాజా పళ్ల రసాలు, జావలాంటివి కూడా తీసుకెళ్లడం మంచిది.

వేసవిలో కాటన్ బట్టలు ధరించటం మంచిది..