స్ట్రాబెర్రీలను రోజూ తీసుకోవడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. గుండె జబ్బులు రాకుండా ఉంటాయి.

స్ట్రాబెర్రీలో ఉండే యాంటీఆక్సిడెంట్ గుణాలు కంటి శుక్లాలు నివారించడంలో, అంధత్వాన్ని దూరం చేయడంలో తోడ్పడతాయి.

పళ్లలోని పీచు పదార్ధాలు  రక్త కణాలపైన, మెదడుపైనా ప్రీరాడికల్స్‌ ప్రభావం చూపి చురుకుగా పనిచేసేట్లు చేస్తుంది.

స్ట్రాబెర్రీల్లో ఆంథోసైనిడిన్‌లు..యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు గుండె జబ్బుల నివారణలో సహాయపడతాయి.

స్ట్రాబెర్రీలో ఉండే  విటమిన్, ఫైబర్, పాలీఫెనాల్స్, యాంటీఆక్సిడెంట్లు అంటువ్యాధుల నుండి రక్షించడంలో కీలక పాత్ర పోషిస్తాయి.

స్ట్రాబెర్రీలో ఉండే ఫైబర్ కూడా ఉదర సమస్యల నుండి దూరంగా ఉంచుతుంది.

స్ట్రాబెర్రీలలో విటమిన్-బి, సిలు రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో సహాయపడతాయి..

స్ట్రాబెర్రీలో ఉండే పొటాషియం, మాంగనీస్, కాపర్, ఐరన్, అయోడిన్ ఎముకలు, కీళ్ల నొప్పిని దూరం చేస్తుంది.

టైప్-2 డయాబెటిస్ రిస్క్ తగ్గుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది.