ఎండ లేకున్నా.. విటమిన్-డి పొందండిలా

వర్షాకాలంలో ఎండ ప్రభావం తక్కువగా ఉంటుంది. 

దీనివల్ల ఉదయం ఎండలో ఉండటం వీలు పడదు. 

దీంతో శరీరానికి విటమిన్‌-డి ఎక్కువగా లభించదు. 

అయితే, కొన్ని ఆహారపు అలవాట్లతో..

వర్షాకాలంలో సూర్యరశ్మి లేకున్నా విటమిన్‌-డి పొందవచ్చు. 

మనం రోజూ తినే ఆహారంలో చేపలు (ట్యూనా, సాల్మన్‌, మాకేరెల్), కోడిగుడ్లు, పుట్టగొడుగులు, చీజ్‌ ఉండేలా చూసుకోవాలి.

వీటితో పాటు పాలు, ప్లాంట్‌ బేస్ట్‌ మిల్క్‌, హోల్‌ గ్రేయిన్‌, పెరుగు, నారింజ వంటివి తీసుకోవడం వల్ల విటమిన్‌-డి పొందవచ్చు. 

ఒకవేళ మనం తినే ఆహారం ద్వారా విటమిన్‌-డి లభించకపోతే డాక్టర్ ను సంప్రదించాలి.

విటమిన్-డి సప్లిమెంట్లను వాడొచ్చు.

అయితే వాటిని మోతాదుకు మించి వాడితే..

శరీరంలో విటమిన్-డి స్థాయిలు పెరిగి..

రక్తవాంతులు, విరోచనాలు, మూత్రవిసర్జన, డీహైడ్రేషన్, కండరాల బలహీనత వంటి సమస్యలు వస్తాయి.