మనిషి ఆరోగ్యానికి కోడి గుడ్డు ఎంతో ప్రయోజనం చేకూరుస్తుంది.
ఎగ్‌లో 6శాతం విటమిన్ ఏ, 7 శాతం విటమిన్ బీ5, 9శాతం విటమిన్ బీ12, 9 శాతం ఫాస్ఫరస్, 15శాతం విటమిన్ బీ2, 22 శాతం సెలీనియం ఉంటాయి.
కోడి గుడ్డులో 6 గ్రాముల హై క్వాలిటీ ప్రొటీన్, అనేకమైన పోషకాలు, తొమ్మిది రకాల ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ ఉన్నాయి.
జ్ఞాపక శక్తి పెంచటంలో కోడి గుడ్డు బాగా ఉపయోగపడుతుంది.
కడుపులో బిడ్డ బ్రెయిన్ ఎదుగుదలకు, వృద్దుల్లో జ్ఞాపక శక్తి పెరగటానికి గుడ్డులో ఉండే కొలీన్ అనే పదార్ధం దోహదపడుతుంది.
కడుపులో బిడ్డ బ్రెయిన్ ఎదుగుదలకు, వృద్దుల్లో జ్ఞాపక శక్తి పెరగటానికి గుడ్డులో ఉండే కొలీన్ అనే పదార్ధం దోహదపడుతుంది.
గుడ్డు తినేవారిలో రక్తనాళాలు మూసుకుపోయి గుడెజబ్బులు వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
స్త్రీలలో రొమ్ము క్యాన్సర్ రాకుండా కాపాడటంలో గుడ్డులో ఉండే ప్రొటీన్లు సహాయకారిగా పనిచేస్తాయని పరిశోధనల్లో తేలింది.
శరీరానికి మేలు చేసే మంచి కొలెస్టరాల్ పెంపుకోసం గుడ్డు తీసుకోవటం ఉత్తమమని చెబుతున్నారు.