2022 T20 వరల్డ్ కప్‌లో భాగంగా ఆదివారం పాకిస్తాన్-ఇంగ్లండ్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరిగింది.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ పాకిస్తాన్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది.
మొదట బ్యాటింగ్ దిగిన పాకిస్తాన్ 20 ఓవర్లకు ఎనిమిది వికెట్లు కోల్పోయి 137 పరుగులు చేసింది.
138 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ 19 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించి విజేతగా నిలిచింది.
గతంలో 2010లో మొదటిసారి ఇంగ్లండ్ ‘టీ 20 వరల్డ్ కప్’ నెగ్గింది.
తాజాగా నేడు తమ రెండో T20 వరల్డ్ కప్‌ని కూడా గెలుచుకుంది.
ఇక 2019లో మొదటి ODI వరల్డ్ కప్ ని కూడా కైవసం చేసుకుంది.
దీంతో ఇంగ్లాండ్ ఖాతాలో మొత్తం మూడు వరల్డ్ కప్స్ చేరాయి.