విద్యార్ధులకు పరీక్షల సమయమిది. ఈ సమయంలో ఆహారం విషయంలో జాగ్రత్తలు చూపించకపోతే ఆరోగ్యపరమైన సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.

ఉదయం తీసుకునే అల్పాహారంలో ప్రొటీన్ , కాల్షియం, ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారపదార్ధాలను తీసుకోవాలి. ఒక గ్లాసు పాలు, సీజనల్ గా లభించే పండ్లు తీసుకోవాలి.

చాలా మంది బ్రేక్ ఫాస్ట్‌ను మానేస్తుంటారు. ఇడ్లీ, దోస, ఉప్మా వాటిని ఏదైనా తీసుకోవచ్చు. 

విద్యార్ధులు మధ్యలో స్నాక్స్ రూపంలో ఖర్జూరం, బాదం, వాల్ నట్స్ వంటి డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలి.

వేసవి కాలంలో సీజన్ వారీగా అందుబాటులో ఉండే పండ్లను పెరుగుతో కలపి ఇవ్వాలి.

వేసవి కాలంలో సీజన్ వారీగా అందుబాటులో ఉండే పండ్లను పెరుగుతో కలపి ఇవ్వాలి.

పరీక్షల సమయంలో పిల్లలకు కాపీలు, టీలు వంటివాటిని ఇవ్వటం మంచిది కాదు. వాటికి బదులుగా గ్రీన్ టీ తీసుకోవచ్చు. 

పరీక్షల సమయంలో పిల్లలకు కాపీలు, టీలు వంటివాటిని ఇవ్వటం మంచిది కాదు. వాటికి బదులుగా గ్రీన్ టీ తీసుకోవచ్చు. 

పరీక్షలు రాసేవారికి వ్యాధులు చుట్టుముట్టకుండా రోగ నిరోధకశక్తి కలిగి ఉండటం అవసరం. దీని కోసం కోసం విటమిన్లు, మినరల్స్ ఎక్కువగా ఉండే ఆహారాలు తీసుకోవాలి.

జంక్ ఫుడ్, కొవ్వులు అధికంగా ఉండే ఆహారల జోలికి వెళ్ళొద్దు.

రిలాక్స్ కోసం , ఒత్తిడిని పోగొట్టుకునేందుకు కొద్ది నిమిషాలు వ్యాయామం చేయాలి.