మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే ప్రొటీన్ చాలా అవసరం.

10 కిలోల శరీర బరువుకు 80 గ్రాముల ప్రొటీన్ రోజువారిగా అవసరమౌతుంది. 

బరువు తగ్గడానికి, కండరాల నిర్మాణానికి ప్రోటీన్ తీసుకోవడం చాలా ముఖ్యం. 

ప్రొటీన్‌ను శరీరంలో అవసరానికి మించి తీసుకుంటే చెడు పరిణామాలు చోటు చేసుకుంటాయి.

అధిక ప్రోటీన్ తీసుకోవడం వల్ల శరీరానికి నీరు ఎక్కువగా తాగాల్సి ఉంటుంది.

ప్రొటీన్ అధికంగా తీసుకోవడం వలన మూత్రపిండాలు వ్యర్ధాలను బయటకు పంపేందుకు ఎక్కువ శ్రమపడి నిర్జలీకరణానికి దారి తీస్తుంది. 

నిర్జలీకరణం వల్ల శరీర బలహీనత, తలనొప్పి వంటి సమస్యలు ఎదురవుతాయి.

అధిక ప్రోటీన్ ఆహారం వల్ల శ్వాసలో దుర్వాసన (కుళ్ళిన పండ్ల వాసన)తో నిండివుంటుంది. 

ప్రొటీన్లు అధికంగా ఉండే ఆహారాలవల్ల మలబద్ధకం సమస్య ఉత్పన్నం అవుతుంది. 

రెడ్ మీట్, ఫ్రైడ్ ఫుడ్స్ ,ఫుల్ ఫ్యాట్ డైరీ ప్రొడక్ట్స్ వంటి మూలాల నుండి ఎక్కువ ప్రొటీన్ తీసుకుంటే అది బరువు తగ్గడం కంటే బరువు పెరగడానికి దారితీయవచ్చు.