మధ్యాహ్నం భోజనం చేసిన తరువాత  నిద్ర ముంచుకొస్తుంది..

కానీ భోజనం తరువాత వెంటనే నిద్రపోకూడదని అంటుంటారు. కానీ కాస్త కునుకు మంచిదేనంటున్నారు నిపుణులు..

మధ్యాహ్నం భోజనం తర్వాత కునుకుపై ప్రపంచవ్యాప్తంగా ఎన్నో అధ్యయనాలు ఇప్పటి వరకు జరిగాయి.మధ్యాహ్నం కునుకు మంచి ఫలితాలను ఇస్తుందని ఎక్కువ శాతం అధ్యయనాలు స్పష్టం చేశాయి.

మధ్యాహ్నం భోజనం చేసిన  తర్వాత 30 నిమిషాలు నిద్ర మంచిదంటున్నారు పరిశోధకులు..

జీర్ణశక్తి : లంచ్ తర్వాత కాస్త విశ్రాంతి తీసుకోవడం జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. తీసుకున్న ఆహారం మెరుగ్గా జీర్ణమై, పోషకాలు శరీరం అంతటికీ చేరుతాయి..

 మధ్యాహ్నం 1-3 గంటల మధ్య 30 నిమిషాలు నిద్రించి.. సాయంత్రం కాస్త  వ్యాయామం చేస్తే..రాత్రి చక్కటి నిద్ర పడుతున్నట్టు అధ్యయనాల్లో గుర్తించారు.

 హార్మోన్లలో అసమతుల్యత ఉన్న వారు మధ్యాహ్నం కొంత సేపు నిద్రించడం వల్ల వారి పరిస్థితి మెరుగుపడుతుంది.

మధుమేహులు, పీసీవోడీ, థైరాయిడ్ సమస్యలతో బాధపడుతున్న వారు మధ్యాహ్నం కునుకు అలవాటు చేసుకోవడం మంచిదన్నది వైద్యుల సూచిస్తున్నారు

మెమొరీ : జ్ఞాపకశక్తికి కూడా మధ్యాహ్నం నిద్ర మేలు చేస్తుంది. ఒత్తిడి తగ్గడానికి కూడా మధ్యాహ్నం నిద్ర చక్కటి సాధనం..

లంచ్ తరువాత కొద్ది సమయం తర్వాత ఎడమవైపునకు తిరిగి 30 నిమిషాల పాటు నిద్రించడం సరైనది. నిద్ర పట్టకపోయినా పర్వాలేదు. కళ్లు మూసుకుని పడుకోవాలి.