బీట్ రూట్ శరీరంలో రక్తం మోతాదును  పెంచుకోవటానికి ఎంతగానో దోహదపడుతుంది.

బీట్ రూట్ లో యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ A, విటమిన్ B6, ఐరన్ వంటివి పుష్కలంగా ఉన్నాయి.

బీట్ రూట్ జ్యూస్ ‌లో ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్స్, ఫైబర్, ఫొలేట్, విటమిన్ సీ, కాల్షియం, మెగ్నీషియం, మాంగనీస్, జింక్ లభిస్తాయి.

బీట్‌రూట్ తో ఆరోగ్యమే కాదు అందానికి కూడా చక్కటి సాధనం

బీట్‌రూట్ గుజ్జులో నాలుగు చుక్కల బాదం నూనె, చెంచా ఆలివ్‌ నూనె వేసి ముఖానికి మర్దన చేసుకోవాలి. అరగంట తరువాత చల్లని నీటితో కడిగేస్తే చర్మం నిగారింపు వస్తుంది..

అరకప్పు పెరుగులో చిటికెడు పసుపూ, కొద్దిగా బీట్‌రూట్‌ గుజ్జు కలిపి ముఖానికి రాసుకుంటే వృద్ధాప్య ఛాయలు దరిచేరవు. చర్మం కాంతిమంతంగా ప్రకాశిస్తుంది.

బీట్‌రూట్‌ గుజ్జులో రెండు చెంచాల ముల్తానీ మట్టీ, చెంచా నిమ్మరసం కలిపి ముఖానికి రాసుకుంటే మొటిమలూ, నల్లమచ్చలు పోయి చర్మం స్మూత్ గా తయారవుతుంది.

బీట్‌రూట్‌ రసంలో నిమ్మరసం కలిపి రాసుకుంటే పిగ్మెంటేషన్‌ సమస్య తొలగిపోతుంది.