ఆ చిన్నారి వయస్సు రెండేళ్లే.. మృత్యువుకు చేరువలో ఉన్నాడు. అరుదుగా వచ్చే అదో వింతైన వ్యాధి అంట.. చావుబతుకుల మధ్య ఆ చిన్నారి పోరాడుతోంది. బతకడం కష్టమేనని వైద్యులు చేతులేత్తేశారు. 

ఈ అరుదైన వ్యాధికి మందు లేదు.. మేం ఏం చేయలేం అంటూ డాక్టర్లు చేతులేత్తేశారు. ప్రతి లక్ష మంది చిన్నారుల్లో ఒకరికి అరుదుగా వస్తుందంట ఈ మాయదారి వ్యాధి.

ఏదైనా అద్భుతం జరిగితే తప్పా ఆ పసిప్రాణం నిలబడదు.. ఆ అద్భుతమేదో తానెందుకు చేయొద్దని ప్రశ్నించుకున్నాడు.. అసలు ఈ వ్యాధి ఏంటి? ఎలా ఎదుర్కోవాలో రీసెర్చ్ చేశాడు.

ప్రపంచం మొత్తాన్ని ఆశ్చర్యపరిచేలా చేశాడు. చిన్నారిని ఎలా కాపాడుకోవాలో తెలియక చివరికి తానే వైద్యుడిలా మారాడు. సొంతంగా మందు తయారు చేయాలని డిసైడ్ అయ్యాడు..

వ్యాధి నివారణకు అవసరమయ్యే కాపర్ హిస్టిడైన్ (copper histadine) గురించి తెలుసుకున్నాడు. ఆ మందు తయారీకి ఒక డివైజ్ కూడా రూపొందించాడు.