ఫెమినా మిస్ ఇండియా 2022 సినీ శెట్టి గురించి ఆసక్తికర విషయాలు..

ఫెమినా మిస్ ఇండియా 2022గా కర్ణాటకకు చెందిన సినీ శెట్టి విజేతగా నిలిచింది.

సినీ శెట్టి చిన్నప్పుడే భరతనాట్యం నేర్చుకుంది. ఆ తర్వాత హిప్ హాప్ నేర్చుకుంది.

ప్రస్తుతం డిగ్రీ పూర్తిచేసి ఛార్టర్డ్‌ ఫైనాన్షియల్‌ అకౌంటెంట్‌(సీఎఫ్‌ఏ) చదువుతుంది.

ఒకవైపు చదువుకుంటూనే మరోవైపు మోడలింగ్ మొదలుపెట్టింది సినీ శెట్టి.

ప్రియాంక చోప్రా స్పూర్తితో మోడల్ గా కెరీర్ మొదలుపెట్టింది.

ఎయిర్‌టెల్‌, ఫ్రీఫైర్‌, పాంటలూన్స్‌ లాంటి పలు సంస్థలకి మోడలింగ్ చేసింది.

మిస్‌ ఇండియా వరల్డ్‌ గెలవకముందే ఈ పోటీల్లో ‘బాడీ బ్యూటిఫుల్‌’, ‘మిస్‌ టాలెంటెడ్‌’ టైటిల్స్‌ను దక్కించుకుంది.

సినీ శెట్టికి ఇన్‌స్టాగ్రామ్ లో దాదాపు లక్షమంది ఫాలోవర్స్ ఉన్నారు.