తన మాటలతో  మంత్రం వేసి  ‘మాటల మాంత్రికుడు’గా ప్రేక్షకుల్లో సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్న  టాప్ డైరెక్టర్  త్రివిక్రమ్ శ్రీనివాస్.  నేడు ఆయన  పుట్టినరోజు సందర్భంగా ఆయన రాసిన  కొన్ని బెస్ట్ డైలాగ్స్.

నిజం చెప్పకపోవడం అబద్ధం.. అబద్ధాన్ని నిజం చేయాలనుకోవటం మోసం!

సంపాదించడం చేతగాని వాడికి ఖర్చు పెట్టే అర్హత లేదు.. చెప్పే ధైర్యం లేనివాడికి ప్రేమించే హక్కు లేదు!

కారణం లేని కోపం, గౌరవం లేని ఇష్టం, బాధ్యత లేని యవ్వనం, జ్ఞాపకాలు లేని వృద్ధాప్యం అనవసరం!

మనం బాగున్నప్పుడు లెక్కలు మాట్లాడి, కష్టాల్లో ఉన్నప్పుడు విలువలు మాట్లాడకూడదు సార్!

ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసినవాడే గొప్పవాడు!

మనం గెలిచినప్పుడు చప్పట్లు కొట్టేవాళ్లు, మనం ఓడినప్పుడు భుజం తట్టేవాళ్లు నలుగురు లేనప్పుడు.. ఎంత సంపాదించినా, ఎంత పోగొట్టుకున్నా.. తేడా ఏమీ ఉండదు!

అద్భుతం జరిగేటప్పుడు ఎవరూ గుర్తించరు.. జరిగిన తరువాత ఎవరూ గుర్తించాల్సిన అవసరం లేదు!

యుద్ధంలో గెలవడం అంటే శత్రువుని చంపడం కాదు.. శత్రువుని ఓడించటం.. ఓడించటమే యుద్ధం యొక్క లక్షణం.. చంపడం కాదు!

దేవరాజు..  కత్తెత్తితే కోతే కోయగలవు..  కత్తి దించి చూడు.. కొత్త రాత రాయగలవు!

పాలిచ్చి పెంచిన తల్లులు సార్.. పాలించటం ఓ లెక్కా వీళ్లకి!