ప్ర‌పంచంలోనే అతిపెద్ద క్రీడా ఈవెంట్ల‌లో ఫిఫా ఫుట్‌బాల్ ప్ర‌పంచ‌క‌ప్ ఒక‌టి. 

 న‌వంబ‌ర్‌ 20న ప్రారంభ‌మైన ఈ మెగా టోర్నీ డిసెంబ‌ర్ 8వ‌ర‌కు కొన‌సాగుతుంది. 

ఫుట్‌బాల్‌ ప్రపంచంలో దాదాపు 21 వరల్డ్‌కప్‌లు జరిగాయి. ఈ ఏడాది (2022) 22వ సారి ఖ‌తార్‌లో జ‌రుగుతుంది. 

ప్ర‌పంచ‌క‌ప్ చ‌రిత్ర‌లో అత్యంత ఖ‌రీదైన టోర్నీ ఇదే. దీనికోసం ఖ‌తార్ దాదాపు 220 బిలియ‌న్ అమెరికా డాల‌ర్లు ఖ‌ర్చుచేసింద‌ని స‌మాచారం. 

29 రోజులు పాటు జ‌రిగే ఈ టోర్నీలో 32 జ‌ట్లు 64 మ్యాచ్‌లు ఆడ‌తాయి.

ప్ర‌పంచ‌క‌ప్‌లో విజేత‌గా నిలిచే జ‌ట్టు రూ. 344 కోట్లు బ‌హుమ‌తి అందుకుంటుంది. 

ర‌న్న‌ర‌ప్‌కు రూ. 245కోట్లు, మూడు, నాలుగు స్థానాల్లో నిలిచిన జ‌ట్ల‌కు వ‌రుస‌గా రూ. 220 కోట్లు, రూ. 204 కోట్లు అందుతాయి.

ప్ర‌పంచ‌క‌ప్ చ‌రిత్ర‌లో మిరోస్లావ్ క్లోజ్ (జ‌ర్మ‌నీ మాజీ ఆట‌గాడు) అత్య‌ధికంగా 16 గోల్ఫ్ చేశాడు. 

 అత్య‌ధిక గోల్ఫ్ చేసిన దేశం బ్రెజిల్ (229) అగ్ర‌స్థానంలో ఉంది. 

ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన అన్ని ప్ర‌పంచ‌క‌ప్‌ల్లోనూ ఆడిన ఏకైక దేశంగా బ్రెజిల్ కొన‌సాగుతోంది. 

పురుషుల ప్ర‌పంచ క‌ప్‌లో తొలిసారి మ‌హిళా రిఫ‌రీలు మైదానాల్లో క‌నిపించ‌నున్నారు.