చలికాలంలో మరిగే నీళ్లతో స్నానం చేయడం ఏ మాత్రం మంచిది కాదు. 

గోరువెచ్చని నీళ్లనే వినియోగించాలి.

స్నానం చేసిన వెంటనే తప్పని సరిగా మాయిశ్చరైజర్ పట్టించండి

చర్మంలో పగుళ్లు రావడం, ఎండిపోవటం, దురద వంటి సమస్యలు రావు. 

చలికాలంలో గాఢత తక్కువగా ఉండే చర్మ సంరక్షణ ఉత్పత్తులను మాత్రమే వాడాలి.

 సన్‌స్క్రిన్ లోషన్ తప్పనిసరిగా వాడాలి. అయితే మాయిశ్చరైజర్‌ అప్లై చేసిన తర్వాత, సన్‌స్క్రిన్ పూసుకోవాలి.

చర్మానికి తేమనందించే ఫేస్‌ మాస్క్‌ వేసుకుంటే, చర్మం నిగారింపు సంతరించుకుంటుంది. 

ఫేస్‌ మాస్క్‌లో నిమ్మ జాతి రసాలను ఉపయోగించకూడదు. 

 ముఖాన్ని తాజా వెన్నతో లేదా కొబ్బరినూనెతో మర్దన చేసి, తర్వాత ముల్తానా మట్టి, రోజ్‌వాటర్‌తో ప్యాక్‌ వేసుకోవాలి.

చలికాలం దాహం తక్కువ. అలాగని సరిపడా నీళ్లు తాగకపోతే చర్మానికి సరిపడా తేమ అందదు.

రోజుకు 8 నుంచి 10 గ్లాసుల నీళ్లు తాగడం తప్పనిసరి.