బిజీ జీవితాల్లో పడి తమ ఆరోగ్యంపై చాలామంది అశ్రద్ధ వహిస్తున్నారు. ఇది మానసిక, శారీరక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇక్కడ చెప్పిన కొన్ని టిప్స్ పాటించడంతో మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోండి.
డైట్.. రోజూవారి డైట్‌లో ఖచ్చితంగా పండ్లు, కూరగాయలు ఉండేలా చూసుకోండి. శరీరానికి కావాల్సిన పోషకాలను ఇవి అందిస్తాయి.
ఉప్పు.. మీరు తినే ఆహారంలో ఉప్పు శాతాన్ని మోతాదులో ఉండేలా చూసుకోండి. డైట్‌లో సాల్ట్‌ను తక్కువగా వాడటం ద్వారా బీపీని కంట్రోల్‌లో పెట్టుకోవచ్చు.
షుగర్.. రోజూవారీ డైట్‌లో షుగర్ 50 గ్రాములు మించకుండా ఉండేలా చూసుకోండి. షుగర్ ఎక్కువగా ఉంటే డయాబెటీస్ వంటి దీర్ఘకాల రోగాల బారిన పడతారు.
నీరు.. రోజూ కనీసం 8 గ్లాసుల నీరు తాగాలి. రోగ నిరోధకతకు, చర్మ ఆరోగ్యానికి, కండరాల పనితీరుకు నీరు తప్పనిసరి.
వ్యాయామం.. వాకింగ్, జాగింగ్, స్విమ్మింగ్ లేదా తేలికపాటి వ్యాయామాలు చేయాలి. వ్యాయామం ద్వారా శరీర బరువును నియంత్రణలో ఉంచుకోవచ్చు.
నిద్ర.. రోజూ తప్పనిసరిగా 7 లేదా 8 గంటలు నిద్రపోవాలి. నిద్రలేమితో బాధపడేవారిలో రోగనిరోధకత బలహీనపడే అవకాశాలు ఉంటాయి.
స్మోకింగ్.. స్మోకింగ్ అలవాటుకు దూరంగా ఉండాలి. స్మోకింగ్ ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు దారితీసే ప్రమాదం ఉంటుంది.