గట్టినే
లపై చెప్పులు లేకుండా నడిచేవాళ్లకు, నీళ్లలో ఎక్కువగా ఉండే వాళ్లకు అరికాళ్లలో పగుళ్లు వస్తుంటాయి.
సరైన ఆహారం తీసుకోకపోవడం, శుభ్రంగా లేకపోవడం వల్ల కూడా ఈ సమస్య వస్తుంది.
అరికాళ్ల పగుళ్లను అలానే వదిలేస్తే మంటలూ పుడతాయి. ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశాలెక్కువ.
కొన్ని చిట్కాలతో అరికాళ్ల పగుళ్లకు చెక్ పెట్టొచ్చు
ఒక టబ్‌లో నీళ్లు పోసి అందులో నిమ్మరసం పిండాలి.
రెండు కాళ్లను ఆ నీళ్లలో ఇరవై నిమిషాల పాటు ముంచ
ి బయటికి తీయాలి.
నిమ్మలో ఉండే సిట్రస్ ఆమ్లం వల్ల మృతకణాలు తొలగిపోతాయి.
ఇలా తరచూ చేస్తుంటే.. మంచి ఫలితం కనిపిస్తుంది.
గోరు వెచ్చని నీటిలో కాళ్లను పెట్టడం వల్ల చక్క
ని ఫలితం కలుగుతుంది.
రాత్రి నిద్రపోయే ముందు కాలి పగుళ్లకు కొబ్బరినూనె పూయాలి. పగుళ్లు
ఉన్నచోట మర్దన చేయాలి.
అలొవెరా జెల్‌తో పాదాల పగుళ్లకు రుద్దాలి. దీనివల్ల పగుళ్లు మాయమవుతాయి.
నువ్వుల నూనెను పగుళ్లపై రాసుకోవడం వల్ల కూడా ఫలితం ఉంటుంది.
మాగిన అరటిపండ్లను చూర్ణంగా చేసి ఆ చూర్ణాన్ని పగుళ్లకు రుద్
దాలి.
ఆరాక.. నిమ్మరసం కలిపిన నీళ్లతో శుభ్రం చేసుకోవాలి.