వ్యాయామం తర్వాత తీసుకోవాల్సిన ఆహారం

బరువు తగ్గటానికి, కండరాలు బలోపేతం కావటానికి వ్యాయామాలు తోడ్పడతాయి. 

రోజువారీ వ్యాయామాల వల్ల రోగనిరోధక శక్తి పెరిగి జబ్బులు దరి చేరకుండా చూసుకోవచ్చు. 

వ్యాయమాల తర్వాత సరైన డైట్ తీసుకోవాలి. సరైన ఆహారం, ద్రవాలు తీసుకోవటం చాలా అవసరం.

గ్లూకోజ్ స్ధాయిలు తగ్గకుండా ఉండేందుకు వ్యాయామం తరువాత గింజలు, డ్రైఫ్రూట్స్‌ తీసుకోవటం మంచిది. 

మొలకెత్తిన పెసర పప్పు, సోయాబీన్ లేదా శనగలు మొదలైన వాటిలో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. 

వ్యాయామం తరువాత ఓట్స్ తీసుకోవచ్చు. ఇందులో ఫైబర్ పుష్కలంగా లభిస్తుంది. 

వ్యాయామాలు పూర్తయిన 45 నిమిషాల్లోపు అరటి పండ్లు తినటం చాలా మంచిది. కండరాల్లో గ్లైకోజెన్‌ నిల్వలు పడిపోకుండా చూస్తాయి. 

వ్యాయామం తరువాత పాలు తీసుకోవటం వల్ల ఎముకలు బలంగా మారేందుకు తోడ్పడతాయి. 

అన్నిటికంటే ముఖ్యంగా వ్యాయామం తరువాత తగినన్ని నీళ్లు సేవించటం మంచిది.