వేసవిలో ఆహారం చాలా త్వరగా పాడైపోతుంది. ఇలాంటి ఆహారాలు తీసుకోవడం ద్వారా ఫుడ్ పాయిజనింగ్ సమస్య తలెత్తే అవకాశం ఉంది.

అల్లం: ఒక కప్పు నీటిలో ఒక టీస్పూన్ తురిమిన అల్లం వేసి మరిగించి.. రుచికి సరిపడా తేనె లేదా చక్కెర కలిపి తాగాలి. ఇలా రెండు సార్లు చేయడం ద్వారా ఫుడ్ పాయిజనింగ్ కు చెక్..

పెరుగు: మెంతులు: ఒక కప్పు పెరుగు, మెంతి గింజలను కలిపి తీసుకోవాలి. మెంతులు మెత్తగా నమిలి తింటే మంచి ఫలితం ఉంటుంది.

నిమ్మకాయ: ఒక చెంచా నిమ్మరసంలో పంచదార, నీరు తాగితే తక్షణ ఉపశమనం లభిస్తుంది.

అరటిపండ్లు: ప్రతిరోజూ కనీసం ఒక అరటిపండు తినాలి. ఇది కాకుండా బనానా షేక్ కూడా తీసుకోవచ్చు.

ఆపిల్ వెనిగర్: ఒక కప్పు వేడి నీటిలో 2-3 టీస్పూన్ల యాపిల్ సైడర్ వెనిగర్ కలపి తాగాలి. ఆహారం తీసుకునే ముందు దీన్ని తాగడం మంచిది.

పాయిజనింగ్ అవ్వకుండా పాటించాల్సిన జాగ్రత్తలు..

భోజనం చేసే స్థలాన్ని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. పాత్రలను శుభ్రంగా ఉంచుకోవాలి.

మసాలా దినుసులలో ఫంగస్ లాంటివి ఉంటాయి. క్రమం తప్పకుండా తనిఖీ చేయండి.

పెరుగు, పాలు, టమోటాలు వంటి వాటిని ఎల్లప్పుడూ ఫ్రీజర్‌లో నిల్వ చేయండి.

వంటగదిని శుభ్రంగా ఉంచుకోండి. ఎల్లప్పుడూ చాకుని కడిగే ఉపయోగించాలి.

ఎల్లప్పుడూ పిండిని, మిగిలిన కూరగాయలను రిఫ్రిజిరేటర్‌లో నిల్వ చేయండి. తినడానికి ముందు చెక్ చేసుకోండి..