శరీరంలో కాల్షియం తగ్గితే... ఎముకలు పటుత్వం కోల్పోతాయి. కాల్షియం ఉండే ఆహారం తింటే ఎముకలు బలంగా అవుతాయి. అటువంటి ఆహారాలేంటో తెలుసుకుందాం..
ఎముకల్లో కాల్షియం తగ్గిపోతే కీళ్ల సమస్యలు మొదలవుతాయి.ఎముకల్లో బలాన్ని పెంచుకుని కీళ్ల సమస్యలు రాకుండా ఉండాలంటే కాల్షియం ఉండే ఆహారాలు తీసుకోవాల్సిందే..
పాలలో కాల్షియం ఎక్కువ. రోజూ పాలు తాగితే ఎముకలు దృఢంగా, ఆరోగ్యంగా అవుతాయి.
నారింజల్లో కాల్షియం ఎక్కువ ఉంటుంది. ఒక నారింజ పండులో 60 మిల్లీగ్రాముల కాల్షియం ఉంటుంది. ఈ పండ్లలో ఉండే విటమిన్ D, సిట్రస్... శరీర వ్యాధినిరోధక శక్తిని పెంచుతాయి.
బాదం : ఓ కప్పు బాదం పప్పుల్లో 457ml కాల్షియం ఉంటుంది. ఇది ఎములకు బలం ఇవ్వటమేకాదు బాడీలో ప్రోటీన్లను కూడా పెంచుతుంది.
అంజీర : ఓ కప్పు అంజీరలో 242ml ఉంటుంది. తరచూ అంజీర తింటే... ఎముకలు గట్టిగా అవుతాయి.
పెరుగులో కాల్షియం, ప్రోటీన్ ఎక్కువగా ఉంటాయి. పెరుగు తినడం ద్వారా కాల్షియం పెంచుకోవచ్చు.
పాలు..పాల పదార్ధాలు అంటే పెరుగు, వెన్న, జున్ను తింటే శరీరానికి కాల్షియం అందుతుంది. వెన్నలో కాల్షియం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది కూడా ఎముకల్ని పటిష్టంగా చేస్తుంది.
ఇంకా కాల్షియం ఎక్కువగా ఉండే ఆకుకూరలు..కూరగాయలు,గింజలు,సోయా, చేపలు, ద్రవపదార్ధాలు తీసుకుంటే ఎముకలు పటుత్వం కోల్పోకుండా ఉంటాయి..