విటమిన్ C విటమిన్ సి వివిధ గుండె జబ్బుల నుంచి, రోగ నిరోధక వ్యవస్థ లోపాల నుంచి, గర్భ సమయంలో వచ్చిన ఆరోగ్య సమస్యలు , కంటి సమస్యలు,చర్మం ముడతలుపడటం నుంచి కూడా రక్షణ కల్పిస్తుంది.

100 గ్రాముల జామకాయలో 228.3 మి.గ్రా విటమిన్ C ఉంటుంది. ఇది నారింజలో ఉండే విటమిన్ C కంటే చాలా రెట్లు ఎక్కువ.సో..జామకాయ   తీసుకోవడం విటమిన్ సి లోపాన్ని తగ్గించుకోవచ్చు..

ఉసిరికాయలో విటమిన్  C (478.56 మి.గ్రా / 100 మి.లీ) ఉంటుంది.   రోజుకి 1,2 ఉసిరికాయలు తింటే రోజుకు సరిపడా విటమిన్ సి పుష్కలంగా   సరిపోతుంది.

100 గ్రాముల నిమ్మ రసంలో 53 మి.గ్రా విటమిన్ C కలిగి   ఉంటాయి. “ఇది ఆపిల్, పుచ్చకాయలు, మామిడి పండ్లు వంటి పండ్లలో ఉండే   విటమిన్ C కంటే ఎక్కువ.

బ్రోకలీలో విటమిన్ C, ఐరన్, విటమిన్ B6, విటమిన్ A వంటి పోషకాలు   పుష్కలంగా ఉన్నాయి. 100 గ్రాముల బ్రోకలీకి 89.2 మి. గ్రా విటమిన్ సి   ఉంటుంది. అందువల్ల, విటమిన్ సి లోపాన్ని నయం చేయడానికి, బ్రోకలీ తినడం   మంచిది.

ఒక కప్పు కాలీఫ్లవర్లో 40 మిల్లీగ్రాముల విటమిన్ C ఉంటుంది.  విటమిన్ K, ఫైబర్ ఉంటాయి. K విటమిన్ ఎముకల దృఢత్వానికీ   దోహదపడుతుంది.

ఒక కివి పండులో రోజుకి సరిపోయే విటమిన్ C ఉంటుంది. కివి తియ్యగా,పుల్లగా   మృదువుగా ఉండే కివిలో విటమిన్ A, పీచు, కాల్షియంతో పాటు ఇతర పోషకాలు   లభిస్తాయి.

100 గ్రాముల లిచీలో 71.5 మిగ్రాల విటమిన్ C ఉంటుంది.అధికంగా పొటాషియం,   ఆరోగ్యకరమైన కొవ్వులు కూడా ఉంటాయి.

1 కప్పు బొప్పాయిలో 144 శాతం రోజుకి సరిపోయే విటమిన్ C ఉంటుంది. ఈ   పండులో విటమిన్ A, ఫోలేట్, పీచు, కాల్షియం, పొటాషియం, ఒమేగా-3 ఫ్యాటీ   యాసిడ్లు కూడా ఎక్కువగానే ఉంటాయి.