తీపి పదార్ధాలు ఎక్కువగా తీసుకుంటేనే షుగర్ లెవెల్స్ పెరుగుతాయని చాలామంది అనుకుంటారు. కానీ మనం రోజూవారీ తీసుకునే ఆహారంతోనూ షుగర్ లెవెల్స్ పెరుగుతాయి.

పండ్లు.. బయట దొరికే ఫ్రూట్ జ్యూస్ తాగితే బ్లడ్‌లో షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. అందుకే పండ్లను నేరుగా తింటే మన శరీరానికి ఫైబర్ అందుతుంది.

డ్రింక్స్.. సాఫ్ట్ డ్రింక్స్ తాగడం వల్ల బ్లడ్‌లో షుగర్ లెవెల్స్ చాలా ఎక్కవగా పెరిగిపోతాయి. అందుకే వాటిని వీలైనంత వరకు దూరం పెట్టడం మంచిది.

వైట్ రైస్.. మనం రోజూ తినే తెల్ల అన్నం కూడా షుగర్ లెవెల్స్ పెరిగేలా చేస్తుంది. పాలిష్ చేసిన రైస్‌లో పోషకాలు తక్కువగా, క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి.

చిప్స్.. ఆలూ చిప్స్ లాంటి జంక్ ఫుడ్‌లోనూ షుగర్ లెవెల్స్ పెంచే క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి.

బ్రెడ్.. మైదాతో చేసిన వైట్ బ్రెడ్ తీసుకోవడంతో రక్తంలో షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి.

స్వీట్స్.. స్వీట్స్, ఐస్‌క్రీమ్ లేదా డిజెర్ట్స్ ఎక్కువగా తీసుకుంటే షుగర్ వ్యాధిని కొనితెచ్చుకున్నట్లే.

చీజ్.. జంక్ ఫుడ్ కావడంతో చీజ్‌లోనూ క్యాలరీలు ఎక్కువగా ఉండి షుగర్ లెవెల్స్‌ను పెంచుతాయి.