మీ గుండె ఆరోగ్యంగా ఉండాలంటే తీసుకోవాల్సిన ఆహార పదార్థాలు
వెల్లుల్లి- రోజు వెల్లుల్లి తింటే గుండె చుట్టూ చెడు కొలెస్ట్రాల్ తగ్గించి రక్త ప్రసరణ సరిగ్గా అయ్యేలా చూస్తుంది.
దానిమ్మ - రక్తపోటుని కంట్రోల్ లో ఉంచుతుంది.
అల్లం - రక్తం గడ్డకట్టకుండా చూస్తుంది.
గ్రీన్ టీ - ఇది తాగేవారికి గుండె సంబంధిత రోగాలు వచ్చే అవకాశం తక్కువ.
అర్జున చెట్టు బెరడు - గుండె కండరాలని బలంగా ఉంచుతుంది.
పసుపు - చెడు కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది.
ఓట్ మీల్స్ - కాల్షియం, ఫైబర్ అందిస్తుంది. రక్తనాళాలు సరిగ్గా పని చేసేలా చూస్తుంది.
బ్లాక్ బీన్స్ - కాల్షియం, మెగ్నీషియం, ఫైబర్ పోషకాలని అందిస్తుంది.
ఆలివ్ ఆయిల్ - మంచి కొవ్వుని అందిస్తుంది. రక్తనాళాలు సరిగ్గా పనిచేసేలా చేస్తుంది.
మెంతులు - గుండె సంబంధిత వ్యాధులు రాకుండా ఉండేందుకు తోడ్పడుతుంది.