గాల్ బ్లాడర్ ఆరోగ్యం కోసం

ఆహారం తీసుకున్న ప్రతిసారీ పిత్తాశయం పిత్తాన్ని విడుదల చేస్తుంది. భోజనం మానేసినప్పుడు పిత్త రసాలు పేరుకుపోతాయి.

పిత్తాశయంలో కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగి.. కాలక్రమేణా అవి కాస్తా పిత్తాశయ రాళ్లుగా గట్టిపడతాయి. 

ఫైబర్‌తో కూడి ఆహారాలు తీసుకోవటం వల్ల చెడు కొలెస్ట్రాల్‌ తగ్గి.. గుండెను రక్షిస్తుంది.

శరీరం బరువు పెరిగిపోతే పిత్తాశయంలో రాళ్ళూ తయారయే అవకాశాలు ఉంటాయి. 

తృణ ధాన్యాలు తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ పెరగదు. 

ధాన్యపు రొట్టె,పాస్తా , బ్రౌన్, వైట్ రైస్,తృణధాన్యాలు వంటివి ఎక్కువ ఫైబర్ ఆహారాలను తీసుకోవటం మంచిది.

విటమిన్ సి, ఈ, ఫైబర్ అధికంగా లభించే కూరగాయలు, ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలి.

మధుమేహం సమస్యతో బాధపడేవారు కూడా గాల్ బ్లాడర్ ను ఆరోగ్యంగా ఉంచుకోవడం ద్వారా ఇతర సమస్యలు రాకుండా చూసుకోవచ్చు.  

జంక్ ఫుడ్ వంటి వాటిని వీలైనంత దూరంగా పెట్టాలి. నలభై ఎన్నాళ్ళ వయసు పై బడిన వారు పిత్తాశయం పై ప్రత్యేకంగా దృష్టి సారించాలి.

పిత్తాశయ వ్యాధికి ఎక్కువ ప్రమాదాన్ని కలిగించే స్వీట్లకు దూరంగా ఉండాలి.