కొందరిని తలనొప్పి తీవ్రంగా ఇబ్బంది పెడుతుంది.

తలనొప్పి కారణంగా అనుకున్న పనులు చేయలేక ఇబ్బందులు పడుతుంటారు.

సహజమైన చిట్కాలతో క్షణాల్లో తలనొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు.

రోజుకు మూడు సార్లు నియమిత వేళల్లో భోజనం తినాలి.

తాజాగా వండిన, వేడిగా ఉన్నఆహారం, వేడివేడి సూప్‌లు తాగాలి. 

చల్లగా, పొడిగా, పెళుసుగా ఉండే పదార్థాలు తినకూడదు

తీపి, ఉప్పు, కారం తగ్గించాలి. కాఫీ, టీలు మానేసి వీలైనన్ని ఎక్కువ నీళ్లు తాగాలి

యోగాభ్యాసంతో శరీర కణజాలానికి పోషణ అంది, నాడీ వ్యవస్థ, అంతఃస్రావ వ్యవస్థ, లింఫ్‌ వ్యవస్థలు చైతన్యమవుతాయి.

కండర కణజాలం స్వాంతన పొంది తలనొప్పి తగ్గుతుంది. ఇందుకోసం ముందుకు వంగే వీలున్న ఆసనాలు వేయాలి.

తలనొప్పి వేదిస్తుంటే.. కనుబొమ్మల మధ్య ఖాళీలో 45సెకన్లు నొక్కి పట్టుకుంటే ఉపశమనం లభిస్తుంది.

 డీ హైడ్రేషన్ వల్ల కూడా తలనొప్పి రావచ్చు. కాబట్టి గ్లాసు చల్లని నీళ్లు తాగితే తలనొప్పి తగ్గే అవకాశం ఉంది.

ఆరెంజ్ జ్యూస్, పాలు వంటివి తీసుకోవడం వల్ల రక్తప్రసరణ సక్రమంగా జరిగి కండరాలపై ఒత్తిడి తగ్గుతుంది.

ఫలితంగా తలనొప్పి నుంచి ఉపశమనం లభించే అవకాశం ఉంటుంది.