నిరంతర ఒంటరితనం అనేది ఒక మానసిక రుగ్మతలా మారుతుంది.

ఒంటరిత‌నంలో ఉంటూ ఎదుటివారు తనతో కలవడం లేదనే కోణంలో మిగతావారిని చూస్తారు.

ఎవరితోనూ మనసులో భావాలను పంచుకోకపోవడం, వారిలో వారే కుమిలిపోవడం లాంటి సమస్యల్లో కూరుకుపోతున్నారు.

ఒంట‌రి త‌నాన్ని దూరంచేసుకునేందుకు ప‌లు ప్ర‌క్రియ‌లు ఉన్నాయి.

ఒంటరితనం ఎక్కడి నుంచి మొదలైందో తెలుసుకోండి. దానికి పరిష్కారానికి దారులు వెతకండి.

ఎవరితోనూ కలవలేకపోవడంలో మీలోని లోపాలను అంగీకరించండి.

వాస్తవ ప్రపంచంలో మీ చుట్టూ ఉన్న వారితో కనెక్ట్ అవ్వడానికి ప్రయత్నించండి.

 వాస్తవ ప్రపంచంలో సంబంధాలను ఏర్పరచుకోవడం ముఖ్యం.

స్నేహితులను తరుచుగా కలిసి వారితో కొంత సమయాన్ని గడపండి.

ఇతరులతో కలిసి చేయగలిగే పనుల కోసం సమయాన్ని వెచ్చించండి

రోజువారీ జీవితంలోని అనుభవాలలో మునిగిపోండి. పాత జ్ఞాపకాలను నెమరువేసుకోండి.

కుటుంబంతో గడిపే క్షణాలను ఆస్వాదించండి. కమ్మని సంగీతాన్ని వినండి.

ఒంటరితనంతో పోరాటం చేయడానికి చురుకైన ప్రయత్నాలు చేయండి.