పాలలో మన శరీరానికి కావల్సిన పోషకాలు దాదాపుగా అన్నీ లభిస్తాయి.

పాలను సంపూర్ణ పౌష్టికాహారంగా పిలుస్తారు.

ప్ర‌తిరోజూ ఒక గ్లాస్‌ పాలను తాగాలని వైద్యులుసైతం సూచిస్తుంటారు.

పాలలో అల్లం రసం కలిపి తాగడం వల్ల ఇంకా మెరుగైన ఫలితాలను పొందవచ్చు.

శరీరానికి పోషకాలను అందించడంతోపాటు వ్యాధులు కూడా తగ్గుతాయి.

అల్లం రసం కలిపిన పాలను తాగడం వల్ల రోగ నిరోధక శక్తి బాగా పెరుగుతుంది.

సీజనల్‌ వ్యాధులు రాకుండా ముందుగానే అరికట్టవచ్చు.

దగ్గు, జలుబు, ఫ్లూ, గొంతు నొప్పి వంటి సమస్యలను నివారించవచ్చు.

ఒకవేళ ద‌గ్గు, జ‌లుబు వంటి స‌మ‌స్య‌లు వ‌చ్చినా పాల‌లో అల్లం క‌లిపి తాగితే ఉపశమనం లభిస్తుంది.

ఈ సీజ‌న్‌లో సహజంగానే ఫుడ్‌ పాయిజనింగ్‌ అవుతుంటుంది.

జీర్ణవ్యవస్థ పనితీరు మందగిస్తుంది. డయేరియా, మలబద్దకం, గ్యాస్‌ వంటి సమస్యలు ఇబ్బందులకు గురి చేస్తుంటాయి.

అల్లం రసం కలిపిన పాలను తాగడం వల్ల ఈ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.

విరేచనాలు, వాంతులు వంటి సమస్యలు కూడా తగ్గుతాయి.

అల్లం రసం కలిపిన పాలను తాగడం వల్ల తిన్న ఆహారం కూడా సరిగ్గా జీర్ణమవుతుంది.