మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘గాడ్‌ఫాదర్’ మూవీ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ సినిమాలో చిరంజీవి నోటివెంట పవర్‌ఫుల్ డైలాగులు పలికించారు చిత్ర యూనిట్.  వాటిలో కొన్ని డైలాగులు ఇక్కడ చూద్దాం.

నిన్ను పంపినవాడికి చెప్పు! నేను రాజకీయం నుండి దూరంగా ఉన్నాను, రాజకీయం నా నుండి దూరం కాలేదు.

ప్రోటోకాల్ కారుకే గానీ.. నా కాళ్ళకు కాదు.

కింగ్ నైనా కింగ్ మేకర్ నైనా క్రియేట్ చేసేది బ్రహ్మ.. గుర్తుంచుకో.

నేనున్నంత వరకు ఈ పార్టీలో తప్పు జరగనివ్వను.. ఈ కుర్చీకి చెద పట్టనివ్వను.

ఇక్కడొక నిర్ణయం తీసుకోవాలంటే హోదా కావాలి.. ఒక పదవి కావాలంటే అర్హత ఉండాలి.. ఎవరో ఏదో చెప్తే అది చెల్లదు.

తప్పుల్లో పెద్ద తప్పు ఏంటో తెలుసా! మంచి చేసినవారికి ఎందుకు ఆ మంచి చేశాం అనిపించేలా చేయడం.

తప్పు చేయాలంటే భయం మాత్రమే మీ మనసుల్లో ఉండాలి.. లేదంటే మీ ఊపిరి గాల్లో కలిసిపోతుంది

వారసత్వం అంటే పదవి కాదు.. బాధ్యత.