రోజూ ఆహారంలో ఆకుకూరలను చేర్చుకోవడం వల్ల ఎన్నో లాభాలున్నాయి.

ఆకు కూరలు తీసుకోవటం వల్ల శరీరానికి చక్కటి పోషణ లభిస్తుంది.

మరి ఏ ఆకుకూరల వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకుందామా..?

బచ్చలికూర :  దీంట్లో విటమిన్లు, పోషకాలు పుష్కలంగా ఉంటాయి.  కళ్లు, మెదడు, గుండె తదితర విషయాల్లో బచ్చలికూర ఎంతో మేలు చేస్తుంది.

తోటకూర: ఈ ఆకులలో యాంటి ఆక్సిడెంట్‌ గుణాలు ఉంటాయి. అందువల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. క్యాన్సర్‌ బారినుంచి కాపాడుతుంది. అనేక పోషకాలు లభిస్తాయి.

గోంగూర: గుండెకు బలం చేకూరుస్తుంది. దంత సమస్యలు, కడుపులో పురుగులు వంటి ఇబ్బందులను తగ్గిస్తుంది.

పుదీనా: రక్తం శుద్ధి చేయడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. నేరుగా నమిలి తినవచ్చు. దీనివల్ల నోటి సమస్యలు, జీర్ణ సమస్యలు తగ్గుతాయి.

మెంతికూర: ముత్రాశయంలో రాళ్లు కరిగిపోతాయి. మధుమేహాన్ని నియంత్రిస్తుంది

పొన్నగంటి కూర: కంటిచూపును మెరుగుపరుస్తుంది.  చలువ చేస్తుంది.