బెల్లం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

రోజూ బెల్లం తినడం వల్ల ఆరోగ్యంగా ఉండవచ్చు.

తాతల కాలం నుంచి బెల్లాన్ని వంటల్లో ఉపయోగిస్తున్నారు. 

పంచదారకు ప్రత్యామ్నాయంగా బెల్లాన్ని ఉపయోగించడం ద్వారా అనారోగ్యాల బారిన పడకుండా ఉంటాము.

రోగనిరోధకశక్తిని పెంచేందుకు సహాయపడుతుంది.

పాలల్లో బెల్లం కలిపి తాగితే ఎముకలు దృఢంగా మారతాయి.

పొటాషియం సమృద్ధిగా ఉంటుంది. 

శరీరంలో జీవక్రియలు సరిగ్గా జరిగేందుకు దోహదపడుతుంది.

కండరాలను పెంచడంతో పాటు పటిష్టంగా ఉంచుతుంది.

రక్తహీనతను తగ్గించే ఐరన్‌ బెల్లంలో ఎక్కువగా ఉంటుంది. 

ఎర్రరక్త కణాలు సాధారణ స్థాయిలో ఉంటాయి.

శరీరంలో రక్తాన్ని శుద్ధి చేస్తుంది. రక్తంలోని హీమోగ్లోబిన్‌ ప్రమాణాన్ని పెంచుతుంది.

జలుబు, దగ్గు, తలనొప్పులకు బెల్లం బాగా పనిచేస్తుంది.

గొంతుమంటని తగ్గిస్తుంది.