మీ పర్సనల్ కంప్యూటర్,  మొబైల్ ఫోన్లలో గూగుల్ క్రోమ్  వాడుతున్నారా? తస్మాత్ జాగ్రత్త..

MeitY ఇండియన్ కంప్యూటర్  ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్.. క్రోమ్ యూజర్లకు  హెచ్చరికను జారీ చేసింది.

క్రోమ్ యూజర్ల సిస్టమ్‌లో సైబర్ నేరగాళ్ల  ఆర్బిటరీ కోడ్‌తో Chrome యూజర్లకు ముప్పు ఉందని CERT-In అంటోంది.

గూగుల్ క్రోమ్ V8లో టైప్ కన్‌ఫ్యూజన్ కారణంగానే అనేక భద్రతాపరమైన లోపాలు ఉన్నాయని ప్రభుత్వ సలహాదారు తెలిపారు.

టెక్ దిగ్గజం గూగుల్ గూగుల్ క్రోమ్ వెర్షన్ V8లో లోపాలను ఫిక్స్ చేస్తూ  లేటెస్ట్ అప్‌డేట్‌ రిలీజ్ చేసింది. 

యూజర్ల ప్రైవసీని నిర్ధారించడానికి క్రోమ్  కొత్త అప్‌డేట్‌లో 22 రకాల సెక్యూరిటీ  ఫిక్స్ చేసింది గూగుల్. 

గూగుల్ క్రోమ్ లేటెస్ట్ వెర్షన్‌కు అప్‌డేట్ చేయాలని ప్రభుత్వ సలహాదారుతో పాటు గూగుల్ సూచించింది. 

గూగుల్ క్రోమ్ స్టేబుల్ ఛానెల్‌ Windows, Mac, Linux యూజర్ల కోసం 96.0.4664.93 వెర్షన్ అప్‌డేట్ చేసింది. 

ఈ కొత్త అప్ డేట్.. గూగుల్ క్రోమ్ యూజర్ల అందరికి అందుబాటులో ఉంది. Chrome లేటెస్ట్ వెర్షన్‌ అప్ డేట్ చేసుకోండి..