వైద్యులు రాసిన మందులను ఎవరైనా సులభంగా అర్థం చేసుకోవచ్చు.

Google ఇండియాలో రీసెర్చ్ డైరెక్టర్ డాక్టర్ మనీష్ గుప్తా ఈ కొత్త AI ఫీచర్ ప్రకటించారు. 

పేషెంట్ల మెడికల్ ప్రిస్క్రిప్షన్‌లో వైద్యులు రాసిన చేతిరాతను AI ఫీచర్ గూగుల్ లెన్స్ ద్వారా సరిగ్గా అర్థంచేసుకోవచ్చు.

సాధారణంగా చాలామంది వైద్యులు మందుల ప్రిస్క్రిప్షన్‌లను అర్థంకానీ రీతిలో రాస్తుంటారు. 

పేషెంట్లు ఆయా ప్రిస్క్రిప్షన్‌లను అర్థం చేసుకోవడం దాదాపు అసాధ్యమే. 

ఈ సమస్య ఎన్నో దశాబ్దాలుగా ఉందనే చెప్పాలి. 

చాలా టెక్ సంస్థలు దీనిని పరిష్కరించేందుకు చాలా ప్రయత్నాలు చేశాయి. 

కానీ, ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు.

ఇప్పుడు Google అసాధ్యం కానిది సుసాధ్యం చేస్తోంది. 

వైద్యుల ప్రిస్క్రిప్షన్‌లను సులభంగా ఎవరైనా అర్థం చేసుకునేలా కొత్త AI ఫీచర్ తీసుకొస్తోంది.