అందాల బ్యూటీ హన్సిక మోత్వాని చైల్డ్ ఆర్టిస్ట్‌గా బాలీవుడ్‌లో కొన్ని సినిమాలు చేసింది.

ఆ తరువాత ‘దేశముదురు’ సినిమాతో టాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది.

తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లోనూ హీరోయిన్‌గా తన సత్తా చాటింది.

అయితే గతకొంత కాలంగా తమిళంలోనే ఎక్కువగా సినిమాలు చేస్తోంది ఈ బ్యూటీ.

ఈ క్రమంలో తమిళ హీరో శింబూతో హన్సిక ప్రేమాయణం కొనసాగించి, మనస్పర్థల కారణంగా విడిపోయారు.

తాజాగా హన్సిక పెళ్లి పీటలెక్కేందుకు సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి.

తమిళనాడుకు చెందిన ఓ రాజకీయ నేత కొడుకుతో పెళ్లికి రెడీ అయ్యిందట ఈ బ్యూటీ.

మరి నిజంగానే హన్సిక పెళ్లి చేసుకోబోతుందా అనేది తెలియాలంటే అమ్మడు క్లారిటీ ఇచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.