భారత క్రికెటర్ హార్దిక్ పాండ్యా, అతని భార్య నటాషా స్టాంకోవిచ్ మరోసారి పెళ్లి చేసుకున్నారు.
రాజస్థాన్లోని ఉదయపూర్లో వీరి వివాహం జరిగింది.
కుటుంబ సభ్యులు, సన్నిహితులు, పలు రంగాల ప్రముఖులు హాజరయ్యారు.
31 మే 2020న వీరిరువురు చట్టప్రకారం మొదటిసారి పెళ్లిచేసుకున్నట్లు ప్రకటించారు.
ఆ సమయంలో కుటుంబ సభ్యులు, దగ్గరి సన్నిహితులు మాత్రమే ఉన్నారు.
పెళ్లి రిసెప్షన్ ఏర్పాటు చేయాలని భావించిన వీలుకాలేదు.
2020 జూలైలో ఈ దంపతులకు బాబు జన్మించాడు.
ప్రేమికుల దినోత్సవం రోజున హార్దిక్, నటాషా మరోసారి వివాహం చేసుకున్నారు.
క్రిస్టియన్ ఆచారాల ప్రకారం వీరి వివాహం జరిగింది.
కుటుంబ సభ్యులు, సన్నిహితులతో పాటు పలురంగాల ప్రముఖులు ఈ వేడుకకు హాజరయ్యారు.