హరిహర వీరమల్లు సెట్ లో హరీష్ శంకర్

పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో శరవేగంగా సాగుతుంది.

తాజాగా డైరెక్టర్ హరీష్ శంకర్ హరిహర వీరమల్లు షూట్ సెట్ కి వెళ్లారు.

హరీష్ శంకర్ తో పాటు మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు కూడా వెళ్లారు.

కాసేపు పవన్ కళ్యాణ్ తో ముచ్చటించిన అనంతరం పవన్, క్రిష్ లతో హరీష్ శంకర్, మైత్రి నిర్మాతలు ఫోటోలు దిగారు. దీంతో పవన్ కళ్యాణ్ ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.