రైతులకు పంట పెట్టుబడి సాయం కింద కేంద్ర ప్రభుత్వం మూడు విడతలుగా ఏడాదికి రూ.6వేలు అందిస్తుంది.
ఇప్పటికే 10 విడతలుగా రైతుల బ్యాంకు ఖాతాల్లోకి కేంద్రం డబ్బులు జమ చేసింది.
వచ్చే నెల 11వ విడత రూ. 2వేలు రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి.
పీఎం సమ్మా
న్ నిధి పథకం అర్హులైన రైతులకే అందేలా కేంద్రం చ
ర్యలు చేపట్టింది.
ఈ పథకంలో అక్రమాలకు చెక్ పెట్టేందుకు ఈ-కేవైసీని తప్పనిసరి చేసింది.
Fill in some text
రూ.2వేలు రావాలంటే రైతులు తప్పని సరిగా ఈ-కేవైసీ పూర్తి చేసుకోవాలి.
రైతులు రెండు విధాలుగా పీఎం కిసాన్ ఈ-కేవైసీని పూర్తి చేయవచ్చు.
Fill in some text
పీఎం కిసాన్ అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లి.. ఓటీపీ ద్వారా ఆన్‌లైన్‌లో వివరాలు సమర్పించవచ్చు.
ఐతే ఇందుకోసం రైతులు తమ మొబైల్ నెంబర్‌ని ఆధార్‌తో అనుసంధానం చేయాల్సి ఉంటుంది.
రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు మాత్రమే ఓటీపీ వస్తుంది. ఓటీపీని ఎంటర్ చేస్తేనే ఈ-కేవైసీ ప్రక్రియను పూర్తవుతుంది.
కామన్ సర్వీస్ సెంటర్‌లో పీఎం కిసాన్ లబ్ధిదారులు బయోమెట్రిక్ పద్ధతిలో ఈ కేవైసీ చేయవచ్చు. వేలిముద్ర పెడితే ఈ కేవైసీ పూర్తవుతుంది.
సాధారణ సేవా కేంద్రంలో కూడా ఈ-కేవేసీ చేయవచ్చు.
రిజిస్టర్డ్ మొబైల్ తప్పనిసరిగా ఉండాలి. ఓటీపీ ద్వారా ఈ ప్రక్రియను పూర్తిచేస్తారు.
ఈ-కేవైసీ చేయించుకోవటానికి ఈ నెల 31వ తేదీ వరకు మాత్రమే అవకాశం ఉంది.