‘సుగంధ ద్రవ్యాల రాణి’ అని పిలిచే యాలకులతో చక్కటి ఆరోగ్యప్రయోజనాలున్నాయి..

వంటలకు గొప్ప రుచిని..సువాసనను అందిస్తాయి యాలకులు..వీటిలో పచ్చ,తెలుపు యాలకులకంటే  నల్ల ఏలకులు మరింత  సుగంధ పరిమళాన్ని కలిగిఉంటాయి..

మానసిక కల్లోలం, మానసిక,భావోద్వేగ ఒత్తిడిని తగ్గించడానికి గొప్ప సాంప్రదాయ ఔషధంగా నల్ల ఏలకులు పనిచేస్తాయి..

నల్ల ఏలకులు చర్మం, వెంట్రుకలు మరియు శరీరానికి చాలా ఉపయోగకరంగా ఉంటాయి.

నల్ల ఏలకుల నూనె కొన్ని ఆరోగ్య, సౌందర్య ప్రయోజనాలకు ఉపయోగిస్తారు.

గుండె సమస్యలు, జీర్ణశయాంతర సమస్యలు , శ్వాసకోశ వ్యాధులను, ముఖ్యంగా ఆస్తమాను నయం చేయడానికి ఉపయోగపడతాయి..

ఊపిరితిత్తుల క్షయ, బ్రోన్కైటిస్, ఆస్తమా మరియు కోరింత దగ్గుకు నల్ల ఏలకులు చాలా ఉపయోగపడతాయి..

కడుపులో ఎసిడిటీని తగ్గిస్తాయి.. వేడి నీటిలో కానీ, టీలలో చిటికెడు ఏలకుల పొడి చల్లుకుని తాగితే కడుపు సమస్యలు అదుపులోకి వస్తాయి.

నోటి దుర్వాసనను తొలగించే ఈ సుగంధ ద్రవ్యం..తల తిరుగుతున్నప్పుడు ఏలకులను నమిలి తింటే ఉపశమనం కలుగుతుంది.

నల్ల ఏలకులు శరీరాన్ని బలోపేతం చేయడానికి సహాయపడటంతో పాటు లైంగిక సామర్ధ్యం సమస్యలను తొలగిస్తాయి.