బ్లడ్ ప్రెజర్ ను అదుపు చేసే శక్తి శనగపప్పుకు ఉంది.
పొటాషియం ఇందులో ఎక్కువగా ఉంటుంది కనుక హై బ్లడ్ ప్రెజర్ కు ఇది చక్కని ఔషధంలా పనిచేస్తుంది.
ఒక కప్పు శనగల్లో 474 ఎంజీల పొటాషియం ఉంటుంది.
శరీరంలో పేరుకుపోయిన చెడు కొవ్వు కరుగుతుంది.
గుండె ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.
బరువు తగ్గాలనుకునే వారు ఉదయం పూట ఈ శనగలను తినడం వల్ల త్వరగా ఆకలి వేయదు.
తద్వారా త్వరగా బరువు తగ్గవచ్చు.
శాకాహారులకు శనగలు ఒక వరమని చెప్పవచ్చు.
మాంసంలో కంటే శనగల్లో అధిక ప్రోటీన్స్ ఉంటాయి.
వీటిని ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమయ్యే ప్రోటీన్స్ అన్నీ లభిస్తాయి.