పెరుగులో నీరు కలిపి చిలికితే వచ్చే పలుచని పానీయం చల్ల లేదా మజ్జిగ (Butter milk). దీనిని వెన్నతోను, వెన్న తొలగించిన తర్వాత చాలా రకాలుగా ఉపయోగిస్తుంటారు
పాలు తోడుపెట్టినందు వలన పాలలో ఉండే పోషక విలువలన్నీ మజ్జిగలోనూ పదిలంగా ఉండటంతో పాటు, అదనంగా లాక్టో బాసిల్లై అనే మంచి బాక్టీరియా మనకు దొరుకుతుంది
ప్రిజ్జులో పెడితే మజ్జిగలోని ఈ బాక్టీరియా నిరర్థకం అవుతుంది, అందుకని అతి చల్లని మజ్జిగ తాగకూడదు
మజ్జిగలో ఇంగువనూ, జీలకర్రనూ, సైంధవ లవణాన్నీ కలిపి తీసుకుంటే పొట్ట ఉబ్బరింపు తగ్గుతుంది
సొరియాసిస్, ఎగ్జిమాకు చిక్కని మజ్జిగలో ఒక నూలు గుడ్డను తడిపి కొన్ని గంటలపాటు చర్మవ్యాధి ఉన్నచోట పరిచి ఉంచితే ఉపశమనం లభిస్తుంది
వయసు పెరుగుతున్నకొద్దీ మజ్జిగ ఎక్కువ తీసుకోవాలి
ఒంటికణత నొప్పికి అన్నంలో మజ్జిగ పోసుకొని కొంచెం బెల్లం కలిపి తినాలి. దీనిని సూర్యోదయానికి ముందే తీసుకోవాలి
మజ్జిగ తాగటం వలన వడదెబ్బ కొట్టదు, పేగులకు బలాన్నిస్తుంది, జీర్ణకోశ వ్యాధులన్నింటికీ ఇది మేలు చేస్తుంది
ఎండలో ప్రయాణాలు చేయవలసి వస్తే, ఒక సీసానిండా మజ్జిగ తయారు చేసుకొని వెంట తీసుకెళ్లండి, మాటిమాటికీ తాగుతూ ఉంటే
వడదెబ్బ కొట్టదు