పని ఒత్తిడి నుంచి ఉపశమనం పొందేందుకు చాలామంది టీ తాగడాన్ని అలవాటు చేసుకుంటారు. అయితే టీ తాగడం వల్ల కలిగే కొన్ని హెల్త్ బెనిఫిట్స్ గురించి ఇక్కడ తెలుసుకుందాం.
టీ తాగడంతో అజీర్తి సమస్యను నివారించవచ్చు.
నెలసరి సమయంలో కడుపు, నడుము నొప్పితో బాధపడే మహిళలు యాలకులు కలిపిన టీ తాగితే ఉపశమనం కలిగిస్తుంది.
టీ తాగితే మెదడు చురుగ్గా పనిచేస్తుందని.. అలసట, ఒత్తిడి మాయమవుతుందని పలు పరిశోధనల్లో తేలింది.
హెర్బల్ టీ తాగడం వల్ల నిద్రలేమి సమస్యకు చెక్ పెట్టవచ్చు.
రోజుకి రెండు కప్పుల టీ తాగడం వల్ల చిగుళ్లలో క్యావిటీస్ ని అరికడుతుంది.
పుదీనా, గ్రీన్ టీ తాగడం వల్ల అలర్జీల నుంచి తొందరగా ఉపశమనం లభిస్తుంది.
గుండె వ్యాధులు, క్యాన్సర్, బరువు తగ్గడం నిరోధిస్తుంది.
టీ తాగడం వల్ల రక్షణ వ్యవస్థను పటిష్టం చేసి బ్యాక్టీరియా, వైరస్‌ల నుంచి కాపాడుతుంది.
టీలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి.