పల్లీలను ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు.
రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో ఉపయోగపడతాయి.
ఎముకలను దృఢంగా ఉంచడంతో పాటు తక్షణ శక్తిని ఇస్తాయి.
పల్లీలను పొట్టుతీయకుండా నానబెట్టుకొని తింటే ఆరోగ్య
ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
రోజూ రాత్రి గుప్పెడు పల్లీలను పొట్టును తీయకుండా ఒక గిన్నెలోకి తీసుకోవాలి.
ఆ పల్లీలు మనిగే వరకు నీటిని పోసి రాత్రంతా నానబెట్టాలి.
నానబెట్టిన పల్లీలను పొట్టుతో సహా ఉదయం అల్పాహారంలో భాగం
గా తీసుకోవాలి.
అధికంగా వ్యాయామాలు చేసేవారు వీటిని తీసుకోవడం వల్ల చక్కటి ఫలితం ఉంటుం
ది.
రోగ నిరోధక శక్తి పెరిగి వ్యాధుల బారిన పడకుండా ఉంటాం.
వీటిలో అధికంగా ఉండే ఫైబర్ జీర్ణశక్తిని మెరుగుపరచడం
లో సహాయపడుతుంది.
పల్లీల పైపొట్టుతో సహా నానబెట్టిన పల్లీలను తీసుకోవడం వల్ల చర్మం పొడిబారకుండా తాజాగా ఉంటుంది.
నానబెట్టిన వాటిని తినలేని వారు ఈ పల్లీలను కొద్దిగా ఉడికించుకుని తినవచ్చు.