వెజ్ బిర్యానీ, ఆలూ కూర్మా, పన్నీర్ మసాలా ఇలా చెప్పుకుంటూ పోతే అనేక రకాల వంటకాల్లో మనం పచ్చి బఠానీలను ఎక్కువగా వాడుతుంటాం

ప్రధానంగా చలికాలంలో ఇవి మార్కెట్‌లో అధికంగా లభిస్తాయి. చూడడానికి చిన్నగా వున్నాయి కదా అని వాటిని చిన్న చూపు చూడకండి

ఈ బుజ్జి బుజ్జి బఠానీ గింజల్లో అనేక ఆరోగ్య ప్రయోజనాలుదాగున్నాయి

చలికాలంలో మార్కెట్లో పచ్చిబఠానీ కాయలు అందుబాటులో ఉంటాయి. చలికాలంలో ఇవి తినడం ఆరోగ్యానికి చాలా మంచిది

పచ్చిబఠానీల్లో ఫ్లేవనాయిడ్స్, కెరోటినాయిడ్స్, పాలీఫినోల్స్, విటమిన్ ఎ, సి మరియు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ మరియు మరికొన్ని ఇతర పోషకాలు కూడా ఉన్నాయి

బరువు తగ్గించడం నుండి బ్లడ్ షుగర్ లెవల్స్ ను క్రమబద్దం గుణాలు పచ్చి బఠానీల్లో ఉన్నాయి

పచ్చిబఠాణీలు ప్రోటీన్‌, ఫైబర్‌ పుష్కలంగా ఉండటం వల్ల మనకి ఎక్కువగా ఆకలి అనిపించదు

పచ్చిబఠాణీలను ఉడకబెట్టికొని మాత్రమే కాకుండా అనేక రకాలుగా కూరలు, సూప్‌ చేసుకొని తినటం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి

సన్నగా నాజుగ్గా కనపడాలనుకునే వారు బఠాణీలను ఎక్కువగా తీసుకుంటే మంచిది

మలబద్దకంతో బాధపడేవారు పచ్చి బఠానీలను ఆకుకూరలు, కూరగాయలతో కలిపి తీసుకుంటే విరేచనం సాఫీగా జరిగి మలబద్దకం నుండి విముక్తి పొందవచ్చు